revanth reddy: నన్ను పరుష పదజాలంతో విమర్శించినా రమణ స్పందించలేదు...క్యాడర్ ను చూస్తే బాధేస్తోంది: రేవంత్ రెడ్డి

  • టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు
  • చంద్రబాబునాయుడు హైదరాబాదు వచ్చేలోగా పార్టీని నాశనం చేస్తున్నారు
  • టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయి
టీడీపీలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ నేత రేవంత్ స్పందించారు. దీనిపై మాట్లాడుతూ, తన పోరాటం ముఖ్యమంత్రి కేసీఆర్ పైనేనని అన్నారు. టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబునాయుడు హైదరాబాదు వచ్చేలోగా పార్టీని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీని చంద్రబాబు సరిదిద్దుకోలేని విధంగా చేసేందుకు తాపత్రయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు వచ్చిన తరువాత అన్నీ ఆయనకు వివరిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. తనను పరుష పదజాలంతో విమర్శించినా రమణ నోరుమెదపలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్యాడర్ కోలుకునేలా నాయకుడు వ్యవహరించాలని ఆయన సూచించారు. క్యాడర్ ను చూస్తే బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. 
revanth reddy
Telugudesam
hydarabad

More Telugu News