జనవరిలో సెట్స్ పైకి 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్!
- తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన 'అర్జున్ రెడ్డి'
- తమిళ రీమేక్ కి సన్నాహాలు
- హీరోగా విక్రమ్ తనయుడు 'ధృవ్'
- దర్శకుడిగా బాల
ఈ సినిమా చూసిన ఆయన ఈ కథ ద్వారా 'ధృవ్' ను హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకి బాల దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు కూడా చెప్పారు. దాంతో విక్రమ్ అభిమానులంతా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలు కానుందనేది తాజా సమాచారం. తొలి సినిమాతోనే 'ధృవ్' హిట్ కొడతాడేమో చూడాలి మరి.