revanth reddy: గోల్కొండ హోటల్ లో టీడీపీ-బీజేపీ నేతల సమావేశం... హాజరుకానన్న రేవంత్ రెడ్డి!

  • గోల్కొండ హోటల్ లో నేటి మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ-బీజేపీ నేతల సమావేశం
  • సమావేశానికి హాజరుకానని ప్రకటించిన రేవంత్ రెడ్డి
  • పార్టీ నుంచి రేవంత్ రెడ్డిన తప్పించేందుకు యత్నాలు
నేటి మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ-బీజేపీ నేతలు హైదరాబాదులోని గోల్కొండ హోటల్ లో సమావేశం కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో రెండు పార్టీల నేతలు చర్చించనున్నారు. రేవంత్ రెడ్డి కేవలం టీడీపీ ఎమ్మెల్యే మాత్రమేనని, ఆయనకు పార్టీలో ఎలాంటి అధికారాలు లేవని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించిన నేపథ్యంలో...గోల్కొండ హోటల్ లో నిర్వహించనున్న సమావేశానికి తాను హాజరు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

దీంతో ఈ ప్రకటన ప్రత్యేకత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి తొలగించే ప్రక్రియ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత ఆదేశాలు లేకుండా సమావేశానికి వెళ్లడం... ఆయనను ఎదిరించడం అవుతుందన్న సండ్ర సూచనతోనే ఆయన సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
revanth reddy
Telugudesam
hydarabad

More Telugu News