america: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి!

  • అమెరికాలోని లూసియానాలోని గ్రాంబ్లింగ్ యూనివర్సిటీలో కాల్పులు
  • కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈల్ ఆండ్ర్యూ (23), మోన్‌ కియారిస్ కాల్డ్‌ వెల్ (23)
  • కాల్పులు జరిపిన దుండగుడు పరారీ, గాలింపు
అమెరికాలో పెరిగిన గన్ కల్చర్ జడలు విప్పుతోంది. నిత్యం ఏదో ఒకచోట కాల్పుల కలకలం ఘటనలు చోటుచేసుకుంటుండగా, తాజాగా లూసియానాలోని గ్రాంబ్లింగ్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. లూసియానాలోని యూనివర్సిటీ క్యాంపస్‌ లో అర్ధరాత్రి దాటిన తరువాత కాల్పుల ఘటన చోటుచేసుకోగా, ఈ ఘటనలో ఈల్ ఆండ్ర్యూ (23) అనే విద్యార్థి, అతడి స్నేహితుడు మోన్‌ కియారిస్ కాల్డ్‌ వెల్ (23) కన్నుమూశారు.

వీరిలో ఆండ్ర్యూ యూనివర్సిటీ విద్యార్థి కాగా, కాల్డ్‌ వెల్ కి యూనివర్సిటీతో సంబంధం లేదని అధికారులు తెలిపారు. అయితే వీరిద్దరూ లూసియానాకు చెందినవారేనని వారు వెల్లడించారు. దీనిపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు ఈ ఘటన యూనివర్సిటీలో నిర్వహించే తరగతులపై ప్రభావం చూపదని, తరగతులు యథావిధిగా కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కాల్పులు జరిపి పరారైన దుండగుడికోసం గాలింపు ప్రారంభించారు. 
america
luciana
grambling university
gun fire

More Telugu News