Asduddin owaisi: అసదుద్దీన్ ఒవైసీ సన్నిహితుల ఇంట్లో ఐటీ ఆకస్మిక దాడులు

  • ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన సోదాలు
  • పలు డాక్యుమెంట్ల పరిశీలన
  • భూమి కొనుగోలు ఒప్పందాల నేపథ్యంలో దాడులు
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సన్నిహితుల ఇళ్లలో బుధవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. టోలీచౌకీలోని అక్తర్, శాస్త్రిపురంలోని షానవాజ్ హుస్సేన్, చార్మినార్‌లోని ఉబెద్ ఇళ్లతోపాటు మరికొందరి ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను పరిశీలించారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సోదాలు సాయంత్రం వరకు కొనసాగడం గమనార్హం. నగరంలో ఇటీవల భూమి కొనుగోలుకు సంబంధించి భారీ ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు దాడులు చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయమై ఎంఐఎం అధినేత నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.  
Asduddin owaisi
mim
hyderabad
it

More Telugu News