హార్దిక్ పటేల్: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో.. హార్దిక్ పటేల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
- జులై 2015లో బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ పటేల్ కార్యాలయంపై దాడి
- గత ఏడాది బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ పటేల్ కారుపై కూడా దాడి
- ఈ కేసుల్లో కోర్టుకు హాజరుకాని హార్దిక్ పటేల్
- గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి నేపథ్యంలో అలజడి
గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన విషయం తెలిసిందే. మరోవైపు ఆ రాష్ట్ర పటీదార్ ఉద్యమ యువ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రహస్యంగా కలిశాడన్న వార్త సంచలనంగా మారింది. ఈ రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు హార్దిక్ పటేల్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జులై 2015లో బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ పటేల్ కార్యాలయంపై హార్దిక్ పటేల్‌తో పాటు పలువురు దాడి చేసిన కేసులో గుజరాత్ విశానగర్‌లోని కోర్టు ఈ రోజు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత ఏడాది బీజేపీ ఎమ్మెల్యే రిషికేష్ పటేల్ కారుపై కూడా హార్దిక్ పటేల్ తో పాటు పలువురు రాళ్లు విసిరారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో హార్దిక్ పటేల్ విచారణకు కోర్టుకు హాజరుకాలేదు.