అనసూయ: బీచ్ ఒడ్డున అనసూయ, రష్మీ కలిసి దిగిన ఫొటో!

  • ‘ట్విట్టర్’ లో ఫొటో పోస్ట్ చేసిన అనసూయ
  • అభిమానుల ప్రశంసల వర్షం 
  • ‘ఒకే చోట ఇద్దరు అందమైన అతివలు’ అంటూ నెటిజన్ల ప్రశంస
ప్రముఖ సినీ ఆర్టిస్టులు, యాంకర్లు అనసూయ, రష్మీ బీచ్ లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటోను అనసూయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ‘శక్తిమంతమైన మహిళలను గుర్తించడం చాలా తేలిక.. ఉన్నతస్థితికి చేరేందుకు అలాంటివారు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటారు. అంతేకానీ, ఒకరినొకరు అణగదొక్కేందుకు యత్నించరు’ అని ఆ ట్వీట్ లో అనసూయ పేర్కొంది.

అభిమానులతో పంచుకున్న ఈ ఫొటోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీరు కూర్చున్న ప్లేసే కాదు, మీరు కూడా అందంగా ఉన్నారు’, ‘ఒకే చోట ఇద్దరు అందమైన అతివలు’, ‘మీ ఇద్దరి స్నేహం బాగుంది’, ‘రెక్కలు లేని దేవతలు’, ‘సూపర్బ్’, ‘ఆసమ్’ అంటూ ప్రశంసించారు.
అనసూయ
రష్మీ

More Telugu News