`గుడ్డు పగలకుండా కింద ఎలా పడేయాలో తెలుసా?`... ప్రియాంక చోప్రాను అడిగిన నెటిజన్
- ట్విట్టర్లో 20 మిలియన్ ఫాలోవర్ల మార్క్ దాటిన పీసీ
- #AskPC అంటూ అభిమానులతో ముచ్చటించిన ప్రియాంక
- వివిధ ప్రశ్నలు సంధించిన నెటిజన్లు
`ప్రియాంక... గుడ్డు పగలకుండా కింద ఎలా పడేయాలో తెలుసా?` అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు `వావ్... నాకు తెలుసుకోవాలని ఉంది.. దాని వెనక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా?` అని అడిగింది.
ఆమెకు నెటిజన్లు సంధించిన మరికొన్ని ప్రశ్నలు.. ప్రియాంక సమాధానాలు....
* పాప్ ఆల్బం కోసం ఎవరితో చేయడానికి ఆసక్తి చూపిస్తావ్?
రిహానాతో పని చేయాలనుకుంటున్నా
* నటి, మ్యుజీషియన్ కాకపోయి ఉంటే ఏ రంగంలో ఉండే దానివి?
ఇంజినీర్.. నాకు 17 ఏళ్ల వయసున్నపుడే ఇంజినీర్ అవ్వాలని నిర్ణయించుకున్నా.
* మీ అభిమానులు చేసిన పిచ్చి పని ఒకటి చెప్పండి?
నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాతో పాటే ప్రయాణించడం
* ప్రస్తుతం నీ జీవితంలో అతిపెద్ద లక్ష్యం ఏది?
నా తర్వాత అడుగును గ్రహించుకోవడం
* నువ్వు 9 గం.ల కంటే ఎక్కువసేపు పడుకొని ఎంతకాలమైంది?
హ..హా... గత వీకెండ్లో పడుకున్నా