dhoni: ముద్దు మాటలతో మలయాళీ పాట పాడిన ధోని కుమార్తె.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో చూడండి!

షార్ట్స్‌లో చూడండి
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గారాలపట్టి జివా సోషల్‌ మీడియా సెలబ్రిటీగా మారిన సంగతి తెలిసిందే. జివాకు సంబంధించిన ప్రతి ప్రత్యేక అంశాన్ని ఆమె తల్లి సాక్షి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. దీంతో దానిని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా జివాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

వచ్చీరాని, చిట్టిపొట్టి మాటలతో జివా మలయాళంలోని శ్రీకృష్ణుడిపై ఉన్న భక్తి గీతాన్ని పాడింది. దీనిని సాక్షి ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఇప్పటి వరకు లక్షన్నర మంది వీక్షించడం విశేషం. ధోనీ అభిమానులు జివా పాటను అభినందిస్తుండగా, కేరళీయులు పండగ చేసుకోవాల్సిన అంశమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Go Back to Shorts
dhoni
sakshi
jiva
song
Instagram

More Telugu News