sasikala: చిన్నమ్మకు కోపమొచ్చింది... మొదటిసారి పళనిస్వామిపై నిప్పులు!

  • నమ్మి సీఎంను చేస్తే హ్యాండిచ్చాడంటున్న శశికళ
  • రెండాకుల గుర్తు కోసం పన్నీర్ తో చేతులు కలిపిన పళని
  • నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చారని ఈసీకి శశికళ ఫిర్యాదు

అక్రమాస్తుల కేసులో నేరం నిరూపితమై, ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, అన్నాడీఎంకే పార్టీ గుర్తు 'రెండాకులు' తమకే చెందాలని ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఈసీని ఆశ్రయించడంపై నిప్పులు చెరిగారు. తాను ఏరికోరి ఎంపిక చేసుకున్న సీఎం పళనిస్వామి కూడా ఎదురుతిరిగి హ్యాండ్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆమె, తొలిసారిగా నిప్పులు చెరిగారు.

ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ, రెండాకుల గుర్తు కోసం వారు తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించారని ఆరోపించారు. రెండాకుల గుర్తు పోతే, రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని భావిస్తున్న ఆమె, ఎడపాడి, పన్నీర్ దాఖలు చేసిన 1877 ప్రమాణ పత్రాల్లో 329 నకిలీ ప్రమాణాలు ఉన్నాయని ఈసీకి లేఖను పంపారు. నకిలీ పత్రాలు సమర్పించినందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా మంది సంతకాలను వీరు ఫోర్జరీ చేశారని ఆరోపించారు.

కాగా, ఈ నెల 30న ఈసీ తుది విచారణ జరిపి రెండాకులు ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని తేలుస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

More Telugu News