ntr: ఎన్టీఆర్ కోరిందీ అదే .. త్రివిక్రమ్ చేసిందీ అదే!

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ చేసిన 'జనతా గ్యారేజ్' .. ' జై లవ కుశ' సినిమాలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవే. ఆ సినిమాలు రెండు సూపర్ హిట్ అయినా, అదే తరహాలో మరో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపలేదు. ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చే కథను చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. తనని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేసే విధంగా కథను సిద్ధం చేయమనే ఆయన త్రివిక్రమ్ ను కోరాడట.

 తనకి గల మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకోకుండా, త్రివిక్రమ్ మార్క్ సినిమానే చేయమని అన్నాడట. దాంతో త్రివిక్రమ్ అలాంటి కథనే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని బ్యాలెన్స్ చేస్తూ త్రివిక్రమ్ సినిమాలు ఉంటాయి. అందువలన అన్నివర్గాల ప్రేక్షకులు ఆయన సినిమాలను చూస్తుంటారు. ఈ కారణంగానే ఆయన సినిమాలకి ఓవర్సీస్ లోను మంచి మార్కెట్ వుంది. ఇక త్రివిక్రమ్ మార్క్ మూవీలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించనున్నాడన్నమాట.   
Go Back to Shorts
ntr
trivikram

More Telugu News