Woman Records Selfie Video: ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలుపుతూ.. సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు మింగిన వివాహిత!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి ఎస్ఏఆర్ అపార్ట్‌మెంట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెయింటెనెన్స్ డబ్బు ఇవ్వాలంటూ త‌మ అపార్ట్‌మెంట్ కార్యదర్శి సలీం తనను వేధిస్తున్నాడని తెలుపుతూ తబుస్సం అనే ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమెను స‌లీం వేధిస్తోన్న విష‌యం నిజ‌మేన‌ని నిర్ధారించారు. నిందితుడు సలీం.. ఆ మ‌హిళ‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మ‌హిళ సెల్ఫీ వీడియో ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగి‌స్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
Go Back to Shorts
Woman Records Selfie Video
Rajendranagar
Hyderabad

More Telugu News