రాహుల్‌ గాంధీ: రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు

  • ‘మోదీ జీఎస్టీ’ అంటే గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్ అని కొత్త భాష్యం చెప్పిన రాహుల్
  • ‘కాంగ్రెస్ జీఎస్టీ’ అంటే జెన్యూన్‌ సింపుల్‌ టాక్స్‌ అని ఈ రోజు ట్వీట్ 
  • దేవుడా.. రాహుల్‌ గాంధీకి కాస్త మంచి బుద్ధి ప్రసాదించు: ధర్మేంద్ర ప్రధాన్
  • జీఎస్టీ అనేది కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనగా గతంలో రాహుల్‌ గాంధీ చెప్పారు
ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నిన్న గుజ‌రాత్‌లో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో మాట్లాడుతూ జీఎస్టీ అంటే గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్ అని కొత్త భాష్యం చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా జీఎస్టీపై ట్వీట్ చేస్తూ ‘కాంగ్రెస్‌ జీఎస్టీ అంటే జెన్యూన్‌ సింపుల్‌ టాక్స్‌’అని, ‘మోదీ జీఎస్టీ అంటే.. గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్’ అని ట్వీట్‌ చేశారు.

 ఈ క్రమంలో రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ ‘దేవుడా.. రాహుల్‌ గాంధీకి కాస్త మంచి బుద్ధి ప్రసాదించు’ అని చుర‌క‌లంటించారు. మోదీ దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదించారని పేర్కొన్నారు. జీఎస్టీ అనేది కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనగా గతంలో రాహుల్‌ గాంధీ చెప్పార‌ని ధ‌ర్మేంద్రప్రధాన్ చెప్పారు.  
రాహుల్‌ గాంధీ
ధర్మేంద్ర ప్రధాన్

More Telugu News