వొడాఫోన్: ఆరు నెలల కాల వ్యవధితో బంపర్ ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్!
- రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే 90జీబీ 4జీ డేటా అన్‌లిమిటెడ్ కాల్స్
- రూ.4.43కే 1జీబీ అన్నమాట
- జియో ఇస్తోన్న పోటీతో దిగివస్తోన్న ధరలు
తమ వినియోగదారులకు వొడాఫోన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే తమ ప్రీపెయిడ్ వినియోగదారులు 90జీబీ 4జీ డేటాను ఆరు నెలల కాల వ్యవధితో పొందవచ్చని పేర్కొంది. అంతేకాదు, అన్‌లిమిటెడ్ లోకల్‌కాల్స్, ఎస్టీడీ కాల్స్ కూడా ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది.
ఈ ఆఫర్ ను పరిశీలించి చూస్తే రూ.4.43కే 1జీబీ వస్తున్నట్లు లెక్క అని పేర్కొంది. టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో ఇస్తోన్న పోటీతో ఇతర కంపెనీలు కూడా పోటాపోటీగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటువంటి ఆఫర్‌ను ఇతర కంపెనీలు కూడా మూడు నెలల కాల వ్యవధితో అందిస్తోన్న విషయం తెలిసిందే. అదే బాటలో పయనిస్తూ వొడాఫోన్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.