ys jagan: జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన నారా లోకేష్

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నెలకు ఒక రోజు కూడా ఏపీ రాజధానికి రావడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలతో హైదరాబాదులో సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని... ఉపాధి హామీ పథకానికి నిధులు రాకుండా ఆ పార్టీ ఎంపీలు కేంద్రానికి లేఖ రాశారని... అయితే, వాస్తవాలను గుర్తించిన కేంద్రం ఆ తర్వాత మళ్లీ నిధులను విడుదల చేసిందని చెప్పారు. లోకేష్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
ys jagan
ysrcp
nara lokesh
Telugudesam

More Telugu News