ఐశ్వర్యరాయ్ నివాసంలో అగ్నిప్రమాదం.. ఆ అపార్టుమెంటులోనే టెండూల్కర్ బంధువులు కూడా!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్ నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న హైరైజ్ అపార్ట్ మెంటులో పెళ్లికాక ముందు ఐశ్వర్య ఉండేది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆమె తల్లి బృందా రాయ్ నివసిస్తున్నారు. మంటలను ఆర్పడానికి ఎనిమిది ఫైరింజన్లు పని చేశాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఐశ్వర్య, ఆమె భర్త అభిషేక్ బచ్చన్ లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఇందులోని 12వ ఫ్లోర్ లో ఐశ్వర్య తల్లి నివసిస్తుండగా, 10వ ఫ్లోర్ లో సచిన్ టెండూల్కర్ బంధువులు ఉంటున్నారు. వివాహానంతరం జుహులోని భర్త నివాసానికి ఐశ్వర్య వెళ్లిపోయింది. మామ అమితాబ్, అత్త జయ, భర్త అభిషేక్, కుమార్తె ఆరాధ్యలతో కలసి ఆమె నివసిస్తోంది. .
Go Back to Shorts
aishwarya rai
abhishek bachchan
bollywood

More Telugu News