amitabh bachchan: ఆహారాన్ని కూడా మింగలేకపోతున్నా: అమితాబ్ బచ్చన్

  • కేబీకే కార్యక్రమం కోసం నెల రోజులుగా మాట్లాడుతున్న బిగ్ బీ
  • దెబ్బ తిన్న స్వరపేటిక
  • యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న అమితాబ్
'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమం తనను ప్రజలకు మరింత దగ్గర చేసిందని... ఇదే సమయంలో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనేలా చేసిందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు. రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారని... బహుశా కొన్ని నెలల పాటు ఈ ఎదురుచూపులు ఫలించకపోవచ్చని ఆయన అన్నారు.

అభిమానులకు, ఈ షో కోసం పనిచేస్తున్న ఎంతో మందికి ఇది బాధాకరమైన వార్తే అని చెప్పారు. ఈ షో కోసం దాదాపు నెల రోజుల పాటు తాను మాట్లాడానని... దీంతో, తన స్వరపేటిక దెబ్బతిందని బిగ్ బీ తెలిపారు. తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్నానని... ఆహారాన్ని మింగలేక పోతున్నానని చెప్పారు. యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నానని అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఈ షో కోసం 24 గంటలూ కష్టపడుతున్న 450 మంది సభ్యులకు తన అభినందనలు అని చెప్పారు.
amitabh bachchan
kbk
bollywood

More Telugu News