jagan: జగన్ పాదయాత్ర మళ్లీ వాయిదా?

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్రను తలపెట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్ కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేమని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో, నవంబర్ 2 నుంచి పాదయాత్రను తలపెట్టిన జగన్ దాన్ని మరోసారి వాయిదా వేశారు.

నవంబర్ 3 శుక్రవారం కావడం, ఆ రోజు కోర్టు విచారణకు హాజరు కావాల్సి వుండటంతో, 6వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కోర్టు కేసు విచారణ కారణంగానే రెండో రోజు యాత్రను ఆపడం ఇష్టం లేని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కనీసం మూడు రోజుల పాటు ఆగకుండా పాదయాత్ర చేయాలని భావించిన జగన్, ఆరవ తేదీ నుంచి 9 వరకూ యాత్ర చేసి, ఆపై 10న కోర్టు విచారణకు రానున్నారు. ఈలోగా హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందాలని కూడా జగన్ తరఫు న్యాయవాదులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Go Back to Shorts
jagan
padayatra
court

More Telugu News