junior ntr: పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఆసక్తికర సన్నివేశం

  • ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల షూటింగ్ ప్రారంభం
  • క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
  • పవన్, ఎన్టీఆర్ ల వ్యాఖ్యలతో నవ్వు ఆపుకోలేకపోయిన యూనిట్ సభ్యులు
వరుస హిట్లతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వస్తున్న సినిమా నిన్న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఓ సన్నివేశం అక్కడున్న వారందరినీ కడుపుబ్బ నవ్వించింది.

ముహూర్తపు షాట్ గా దేవుడి పటాలకు ఎన్టీఆర్ మొక్కుతున్న సన్నివేశాన్ని తీశారు. ఈ షాట్ కు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. ఆ తర్వాత 'యాక్షన్' అని చెప్పి మోకాళ్ల మీద కూర్చున్నారు. "క్లాప్ కొట్టేటప్పుడు ఏం చెప్పాలి? నాకు అసలే భయం సర్. చేతులు వణుకుతున్నాయి" అంటూ పవన్ చిన్న స్వరంతో అన్నారు.

దీంతో, ఎన్టీఆర్ సహా అక్కడున్నవారంతా ఆనందంగా నవ్వేశారు. అనంతరం ఎన్టీఆర్ ను పవన్ కౌగిలించుకుని, అభినందనలు తెలిపారు. అంతకు ముందు ఎన్టీఆర్ అక్కడున్న పలు దేవుళ్ల ఫోటోలను చూస్తూ... ఇంతకీ తాను ఏ దేవుడివైపు చూసి దణ్ణం పెట్టాలంటూ ఏమీ అర్థంకానట్టు అడిగాడు. దీంతో, అక్కడున్నవారు ఎవరూ నవ్వు ఆపుకోలేకపోయారు. రామానాయుడు స్టూడియోస్ లో నిన్న జరిగిన కార్యక్రమం ఇలా సందడిగా, ఆనందభరితంగా కొనసాగింది.
junior ntr
trivikram srinivas
pawan kalyan
tollywood

More Telugu News