chandrababu: దుబాయ్ ని వదిలి లండన్ కు బయలుదేరిన చంద్రబాబు!

  • దుబాయ్ లో ముగిసిన పర్యటన
  • లండన్ లో అమరావతి ఆకృతులు పరిశీలించనున్న చంద్రబాబు
  • నార్మన్ అండ్ పోస్టర్స్ ప్రతినిధులతో రెండు సార్లు భేటీ
  • తుది డిజైన్లు ఖరారు చేసే అవకాశాలు
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బృందం, దుబాయ్ లో రెండు రోజుల పాటు ఉండి, అక్కడి పారిశ్రామికవేత్తలకు నవ్యాంధ్రలో పెట్టుబడి అవకాశాలను వివరించి, పలు ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆపై చంద్రబాబు టీమ్, లండన్ కు బయలుదేరి వెళ్లింది. మరికాసేపట్లో లండన్ కు చేరుకునే చంద్రబాబునాయుడు, అక్కడ అమలవుతున్న ప్రజా రవాణా వ్యవస్థను స్వయంగా పరిశీలించనున్నారు.

ఆపై అమరావతిలో శాశ్వత నిర్మాణాల ఆకృతులపై నార్మన్ అండ్ పోస్టర్స్ తయారు చేసిన మోడల్స్ తిలకిస్తారు. నార్మన్ అండ్ పోస్టర్స్ ప్రతినిధులతో రెండుసార్లు సమావేశమై సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్, ఇతర భవనాల ఆకృతులపై తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా, ఇప్పటికే దర్శకుడు రాజమౌళి ఓ దఫా లండన్ వెళ్లి, కొన్ని మోడల్స్ పరిశీలించి, వాటికి కొన్ని మార్పులు చెప్పి వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి చెప్పిన విధంగా మార్చిన ఆకృతులను చంద్రబాబు పరిశీలించి, నేడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
chandrababu
london
narman posters

More Telugu News