vijay: హీరో విజయ్ క్రిస్టియన్ అని చూపుతున్న ఓటర్ ఐడీ... పోస్టు చేసి నిప్పులు చెరిగిన బీజేపీ నేత

  • జోసఫ్ విజయ్ పేరుతో ఉన్న ఓటరు ఐడీని బయట పెట్టిన హెచ్ రాజా
  • సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీజేపీ నేత
  • ఇప్పటికైనా నిజం చెప్పాలని డిమాండ్
తమిళ హీరో విజయ్ మతం మార్చుకున్నాడని నిన్న సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా, నేడు వివాదానికి మరింత ఆజ్యం పోశారు. విజయ్ ఓటరు ఐడీ కార్డును (నెంబర్ టీఏయూ 1900109)ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పటికైనా నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటర్ ఐడీలో విజయ్ పేరు జోసఫ్ విజయ్ అని ఉంది. దాని పక్కనే సీ జోసఫ్ విజయ్, మూవీ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ అని ఉన్న ఓ లెటర్ హెడ్ ను కూడా పోస్టు చేశారు.

 నిజాన్ని ఎవరూ చంపలేరని వ్యాఖ్యానించిన ఆయన, మెర్సల్ సినిమాలోని డైలాగ్ "దేవాలయాల కన్నా ముందు ఆసుపత్రులను నిర్మించాలి" అని ప్రస్తావిస్తూ, గత 20 సంవత్సరాల్లో 17,500 చర్చిలు, 9,700 మసీదులు, 370 దేవాలయాలు ఇండియాలో నిర్మితమయ్యయి. వీటిల్లో వేటిని కూల్చి ఆసుపత్రులు కట్టిద్దామో విజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
vijay
mercel
tamil movie
h raja

More Telugu News