sheep: రైలు ఢీకొని 400 గొర్రెలు మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

  • ట్రాక్‌కు ఇరువైపులా చెల్లాచెదురుగా పడిన గొర్రెలు
  • రూ.10 లక్షల వరకు నష్టం
  • లబోదిబోమంటున్న గొర్రెల కాపరి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వద్ద రైల్వే ట్రాక్‌పై ఘోరం జరిగింది. రైలు ఢీకొని దాదాపు 400 గొర్రెలు మృతి చెందడంతో గొర్రెల కాపరి లబోదిబోమని రోదిస్తున్నాడు. గొర్రెల మంద ట్రాక్‌ను దాటుతున్న సమయంలో ఒక్కసారిగా రైలు రావడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడి ఉన్న గొర్రెలను చూసి గొర్రెల కాపరి గుండె ఆగిపోయినంత పనైంది. గొర్రెల మరణంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం జరిగిందని, తనను ఆదుకోవాలని గొర్రెల కాపరి కోరుతున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

sheep
train
dead
nalgonda

More Telugu News