కోహ్లీ: ఆక్యూపంచరిస్ట్ ని కలిసిన కోహ్లీ-అనుష్క జంట!
- ఆక్యూపంచరిస్ట్ ని కలిసిన కోహ్లీ- అనుష్క
- ఆ వైద్యుడిని సంప్రదించాలని అనుష్క సూచన
- వైద్యుడి ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఫొటోలు
ప్రేమ జంట కోహ్లీ- అనుష్కశర్మ ఇటీవలే ఓ వైద్యుడిని కలిశారు. ఎందుకంటే, కోహ్లీ కోసమే! ఆక్యూపంచరిస్ట్ డాక్టర్ జెవెల్ గమాదియా వద్దకు కోహ్లీని అనుష్క తీసుకు వెళ్లింది. ఈ సందర్భంగా తనను కలిసిన కోహ్లీ - అనుష్కలతో జెవెల్ గమాదియా ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, బాలీవుడ్ తారులు కత్రినా కైఫ్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కు ఇష్టమైన ఆక్యూపంచరిస్ట్ జెవెల్. అనుష్క సూచన మేరకు కోహ్లీ ఆ వైద్యుడిని కలిసి మాట్లాడాడు.