మాధవన్ : కొత్త బైక్ పై హీరో మాధవన్!
- ‘ఇండియన్ రోడ్ మాస్టర్’ని కొనుగోలు చేసిన మాధవన్
- ఎక్స్ షోరూమ్ ధర రూ.40.45 లక్షలు
- ఓ వీడియోను, ఫొటోలను పోస్ట్ చేసిన మాధవన్
దక్షిణాది హీరో మాధవన్ కు బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతని బైక్ గ్యారేజ్ లో ఇప్పటికే ఎంతో ఖరీదైన టూ వీలర్స్ బీఎండబ్ల్యూ కే1600 జీటీఎల్, డ్యుకాటీ డియావెల్, యమహా వీ-మ్యాక్స్ ఉన్నాయి. తాజాగా, అమెరికా బైక్ ‘ఇండియన్ రోడ్ మాస్టర్’ మాధవ్ గ్యారేజ్ లో చేరింది. రూ.40.45 లక్షల విలువ చేసే ఈ బైక్ ను కొనుగోలు చేసినట్టు మాధవన్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పేర్కొన్నాడు.
దీపావళి పండగ తన కొత్త బైక్ తో ప్రారంభించానని, చాలా ఉద్వేగంగా ఉన్నానని తన పోస్ట్ లో మాధవన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కొత్త బైక్ వీడియోను, దానిపై తాను దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇక, ఈ బైక్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే.. థండర్ స్ట్రోక్ 111 ఇంజన్ విత్ ఎన్ ఎం, మ్యూజిక్, నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉన్న టచ్ స్క్రీన్ సిస్టమ్, ఎల్ ఈడీ లైట్స్, బ్లూ టూత్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్లు ఈ బైక్ సొంతం.