balakrishna: 'కర్ణ' కాదట .. బాలయ్య సినిమా కోసం మరో పవర్ఫుల్ టైటిల్

షార్ట్స్‌లో చూడండి
ఎప్పుడూ కూడా బాలకృష్ణ తన సినిమాల మధ్య పెద్ద గ్యాప్ రానీయరు. ఎంత త్వరగా ఆయన సినిమాలు సెట్స్ పైకి వెళతాయో .. అంతే త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలాగే 'పైసా వసూల్' ను ఆడియన్స్ ముందుకు తెచ్చిన ఆయన, తన 102వ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, నయనతార .. నటాషా దోషితో పాటు హరిప్రియ కథానాయికలుగా కనిపించనున్నారు.

 ఈ సినిమాకు 'కర్ణ' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో వున్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి 'కర్ణ' టైటిల్ ను ఫిక్స్ చేయలేదట. 'జయసింహ'ను ఖరారు చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. 'సింహ' అనే టైటిల్ గల బాలకృష్ణ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో, అదే సెంటిమెంట్ తో ఈ సినిమాకి 'జయసింహ'ను ఫిక్స్ చేయనున్నట్టు చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
Go Back to Shorts
balakrishna
nayanatara

More Telugu News