team inda: న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు జట్టు ప్రకటన.. స్థానం దక్కించుకున్న హైదరాబాదీ

  • మూడు టీ20లకు జట్టు ఎంపిక
  • హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కు స్థానం
  • జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్
న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఎంపిక కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లతో జరిగిన మ్యాచ్ లలో ఇండియా-ఏ తరపున ఆడిన సిరాజ్ సత్తా చాటాడు. దీంతో, అతనికి టీ20ల్లో బెర్త్ దక్కింది.

టీ20 టీమ్ ఆటగాళ్లు వీరే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మెహమ్మద్ సిరాజ్, ఆశిష్ నెహ్రా.

అయితే ఆశిష్ నెహ్రాను కేవలం ఒక మ్యాచ్ కు మాత్రమే ఎంపిక చేశారు. ఈ మ్యాచ్ తర్వాత నెహ్రా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య మొత్తం మూడు టీ20లు జరగనున్నాయి. విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించి, రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారని భావించినప్పటికీ... సెలక్టర్లు రొటేషన్ కు మొగ్గు చూపలేదు.
team inda
indian squad for t20
newzealand cricket

More Telugu News