molestation: యువ‌తిని బ‌లాత్కారం చేయ‌బోయిన‌ వ్య‌క్తి... వైర‌ల్ అవుతున్న సీసీ కెమెరా దృశ్యాలు

ఒక యువ‌తిని వేధించి, బ‌లాత్కారం చేయ‌బోయిన వ్య‌క్తి వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కొజికోడ్‌కి చెందిన 31 ఏళ్ల జంషీర్, ఓ యువ‌తి వెళ్లే దారిలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమెను బ‌లాత్కారం చేయ‌బోయాడు. ఆమె గ‌ట్టిగా అరుస్తూ ప్ర‌తిఘ‌టించ‌డంతో అక్క‌డి నుంచి పారిపోయాడు. అత‌ను బ‌లాత్కారం చేయ‌బోవ‌డం, అక్క‌డి నుంచి పారిపోవ‌డం ప‌క్క‌నే ఇంటి మీద ఉన్న‌ సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ వీడియోలో జంషీర్ ముఖం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌టంతో బాధితురాలు ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే న‌డ‌క్క‌వ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే గ‌తంలో కూడా జంషీర్ మీద‌ అత్యాచారయ‌త్నం కేసులు ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు.

molestation
kozhikode
jamsheer
cctv footage
viral
social media

More Telugu News