moustachid: మీసాలు, గ‌డ్డంతో మోనాలిసా చిత్రం... వేలంలో అధిక ధ‌ర ప‌లికిన వైనం

షార్ట్స్‌లో చూడండి
లియొనార్డో డావిన్సీ గీసిన‌ మోనాలిసా చిత్రానికి చిన్న మార్పులు చేస్తూ గీసిన మీసాలు, గ‌డ్డంతో ఉన్న మోనాలిసా చిత్ర‌ప‌టం వేలంలో అధిక ధ‌ర ప‌లికింది. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జ‌రిగిన సూథ్‌బే వేలంలో ఈ చిత్ర‌ప‌టం 6,32,500 యూరోల‌కు అమ్ముడు పోయింది. ఈ చిత్రాన్ని ఫ్రెంచ్ చిత్రకారుడు మార్ష‌ల్ డూఛాంప్ 1964లో వేశాడు. అనుకున్న ధ‌ర కంటే ఎక్కువ ధ‌ర ప‌ల‌క‌డంతో వేలం నిర్వాహ‌కులు ఆనందం వ్య‌క్తం చేశారు. అమెరికాకు చెందిన ఆర్థ‌ర్ బ్రాండ్ అనే వ్య‌క్తి వ‌ద్ద ఉన్న 110 వ‌స్తువులను సూథ్‌బే వారు ఈ వేలంలో ఉంచారు. వీటిలో అమ్ముడు‌పోయిన వాట‌న్నింటి విలువ 3.9 మిలియ‌న్ యూరోలు ఉండొచ్చ‌ని స‌మాచారం. మార్ష‌ల్ డూఛాంప్ వేసిన తొమ్మిది చిత్రాల‌ను ఈ వేలంలో అందుబాటులో ఉంచారు.
Go Back to Shorts
moustachid
monalisa
leonardo davinci
marshal duchamp
paris
sothebay

More Telugu News