టీమిండియా: క్రికెట్ అప్ డేట్స్: 41 ఓవర్లలో 201 పరుగులు చేసిన టీమిండియా
- శతకం దిశగా కోహ్లీ
- ధోనీ అవుటవడంతో ఐదో వికెట్ కోల్పోయిన భారతజట్టు
- టీమిండియా స్కోర్: 41 ఓవర్లలో 201/5
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో కోహ్లీ-ధోనీల భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. వాంఖడే స్డేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 41 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 201 పరుగులు చేసి, 5 వికెట్లు నష్టపోయింది. కోహ్లీ 85 పరుగులతో కొనసాగుతున్నాడు. 41వ ఓవర్ చివర్లో ధోనీ (25) అవుటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్ లో గుప్తిల్ కు క్యాచ్ ఇచ్చాడు. కోహ్లీకి జతగా పాండ్యా బరిలోకి దిగాడు.