rahul gandhi: రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తమిదే!

  • 30న పట్టాభిషేకం
  • 26న అధ్యక్షుడిగా ప్రకటన
  • 19 ఏళ్ల తరువాత సోనియాకు విశ్రాంతి
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 30న ఆయన్ను పార్టీ అధ్యక్షుడి పీఠంపై కూర్చోబెడతారని సమాచారం. ఈలోగానే... అంటే 26వ తేదీన అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆపై నాలుగు రోజుల తరువాత సోనియా నుంచి రాహుల్ పగ్గాలు స్వీకరిస్తారని తెలుస్తోంది. సోనియా గాంధీ గత 19 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక రాహుల్ అధ్యక్షుడైతే, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గాంధీ-నెహ్రూ కుటుంబంలోని ఐదో వ్యక్తి అధ్యక్షుడైనట్టు. రాహుల్ కన్నా ముందు నెహ్రూ, ఇందిర, రాజీవ్ లు, ఆపై ప్రస్తుతం సోనియా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు.
rahul gandhi
congress
sonia

More Telugu News