bsnl mela: సిమ్, డేటాను ఉచితంగా ఇస్తూ, బీఎస్ఎన్ఎల్ మెగా మేళా

షార్ట్స్‌లో చూడండి
ఉచితంగా సిమ్ తో పాటు డేటాను అందిస్తూ, రేపటి నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక మెగా మేళాను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అనంతరామ్‌ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ స్మార్ట్ సిమ్ ను, 350 మెగాబైట్ల డేటాను ఫ్రీగా అందిస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 27వ తేదీ వరకూ మెగా మేళా జరుగుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లను కూడా కస్టమర్లు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 18001801503 నంబరుకు కాల్ చేయాలని అన్నారు.
Go Back to Shorts
bsnl mela
3g smarti sim
deta

More Telugu News