pawan kalyan: పవన్ కల్యాణ్ కు షూటింగ్ లో మరో ప్రమాదం.. గాయాలు చిన్నవే.. ఆందోళన వద్దన్న యూనిట్!

  • ఇప్పటికే గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్న పవన్
  • యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా చిన్న ప్రమాదం
  • అభిమానులు ఆందోళన చెందవద్దన్న చిత్ర యూనిట్
  • నిరంతరాయంగా సాగుతున్న షూటింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా, ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మగుళూరు ప్రాంతంలో జరుగుతుండగా, ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న వేళ, స్వల్ప ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఈ ఫైట్ సీన్ లో ఇప్పటికే ఆయనకు ఓ గాయం కాగా, దాన్ని లెక్క చేయకుండా పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక తాజా ఘటనలోనూ ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ గాయం కూడా చిన్నదేనని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. తమ అభిమాన హీరోకు స్వల్ప గాయమే అయిందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చిత్రం షూటింగ్ నిరంతరాయంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
pawan kalyan
trivikram srinivas

More Telugu News