pavan kalyan: జనసేనకు ఎదురుదెబ్బ.. మోసం, బెదిరింపు కేసులో పార్టీ అధికార ప్రతినిధి కల్యాణ్ సుంకర అరెస్ట్!

  • ఓఎల్ఎక్స్‌లో మోసం
  • ఐఫోన్ 7 డమ్మీ ఫోన్ అమ్మకం
  • నిలదీసిన బాధితుడిని ఎయిర్‌గన్‌తో బెదిరించిన వైనం
టాలీవుడ్ ప్రముఖ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నాయకుడు కల్యాణ్ సుంకరను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్‌లో ఐఫోన్ 7ను అమ్మకానికి పెట్టిన కల్యాణ్ ఒరిజనల్ ఫోన్‌కు బదులు డమ్మీ ఫోన్‌ను విక్రయించాడు. దీంతో ఫోన్ కొన్న వ్యక్తి డమ్మీ ఫోన్‌ను ఎందుకు అమ్మావని ప్రశ్నించడంతో కల్యాణ్ అతడిని ఎయిర్‌గన్‌తో బెదిరించి హల్‌చల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కల్యాణ్ నుంచి ఫోర్డ్ ఎండీవర్ కారు, ఎయిర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కల్యాణ్ సుంకర పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్టీ తరపున పలు చానెళ్లలో చర్చల్లోనూ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ను పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మరి దీనిపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి! 
pavan kalyan
janasena
kalyan sunkara
arrest

More Telugu News