potus: వేలంలో 16 వేల డాల‌ర్లు ప‌లికిన ట్రంప్ వేసిన‌ డ్రాయింగ్‌

  • ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బొమ్మ‌ను వేసిన ట్రంప్‌
  • లాస్ ఏంజెలెస్‌లో జ‌రిగిన వేలం
  • 1995లో ఛారిటీ కోసం డ్రాయింగ్ వేసిన అధ్య‌క్షుడు
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో నిర్వ‌హించిన ఓ వేలంలో అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన న‌ల్ల స్కెచ్ డ్రాయింగ్ ఒక‌టి 16వేల డాల‌ర్లు ప‌లికింది. ఈ విష‌యాన్ని వేలం నిర్వ‌హించిన సంస్థ జూలియ‌న్స్ ఆక్ష‌న్స్ మీడియాకు వెల్ల‌డించింది. 1995లో ఛారిటీ కోసం ఫ్లోరిడాలోని త‌న మార్ ఎ లాగో ఎస్టేట్‌లో ఉండి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బొమ్మను ట్రంప్‌ గీశాడు. అప్ప‌ట్లో ఈ డ్రాయింగ్ 100 డాల‌ర్ల కంటే త‌క్కువ‌కే అమ్ముడు పోయిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో కూడా ట్రంప్ గీసిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మ‌రో డ్రాయింగ్ 29 వేల డాల‌ర్లకు వేలంలో అమ్ముడుపోయింది.
potus
donald trump
drawing
sketch
donald trump
empire state building

More Telugu News