ram gopal varma: సినిమా తీస్తున్నందుకు ఎన్టీఆర్ నన్ను అభినందిస్తున్నారు!: రామ్ గోపాల్ వర్మ తమాషా ట్వీట్

  • ఎన్టీఆర్ తో కలిసున్న ఫొటోను పోస్ట్ చేసిన వర్మ
  • ఫొటోలో చంద్రబాబు కూడా
  • ఎన్టీఆర్ అభినందిస్తున్నారంటూ కామెంట్
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. టీడీపీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం దగ్గర నుంచి అన్ని రకాలుగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తద్వారా అందరి దృష్టి తన సినిమాపైనే ఉండేలా చేయడంలో సఫలీకృతం అయ్యారు. తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఆయన ఓ ఫొటోను అప్ లోడ్ చేశారు.

ఓ కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటో ఇది. ఈ ఫొటోలోనే చిన్న బాక్స్ లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలు దండలు మార్చుకుంటుండగా... వారికి సమీపంలో చంద్రబాబు నిలిచి ఉన్న ఫొటోను ఉంచారు. 'ఆయనపై సినిమా తీస్తున్నందుకు నన్ను ప్రశంసిస్తున్న ఎన్టీఆర్' అంటూ కామెంట్ పెట్టారు.
ram gopal varma
lakshmis ntr
ntr
tollywood

More Telugu News