jd chakravarthi: రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోగా నటిస్తున్నా: జేడీ చక్రవర్తి

  • కథలో దమ్ముండాలి
  • ఇష్టానుసారం సినిమా తీస్తే ఫట్టే
  • మూడు సినిమాల్లో నటిస్తున్నా
ఇష్టానుసారం సినిమా తీస్తే హిట్ కాదని... కథలో దమ్ముంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని హీరో, దర్శకుడు జేడీ చక్రవర్తి అన్నాడు. అందరికీ నచ్చిన అమ్మాయిని మనం పెళ్లి చేసుకోలేకపోవచ్చని... అలాగే, అందరికీ నచ్చినట్టుగా సినిమాను తీయలేమని చెప్పాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నానని, దర్శకత్వం కూడా చేస్తున్నానని జేడీ చెప్పాడు. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదని... డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉగ్రం' చిత్రంలో హీరోగా నటిస్తున్నానని చెప్పాడు. దీనికి తోడు కన్నడలో టాప్ హీరోయిన్ అయిన పూజాక్రాంతి నిర్మిస్తున్న 'రావణి' చిత్రంలో ఆమె సరసన హీరోగా నటిస్తున్నానని తెలిపాడు.
jd chakravarthi
ram gopal varma
tollywood

More Telugu News