అర్జున్ టెండూల్క‌ర్: టీమిండియా ఆటగాళ్లకు అర్జున్ టెండూల్కర్‌ ఎలా బౌలింగ్ చేస్తున్నాడో చూడండి!

  • ఇటీవల జేవై లేలే ఆలిండియా అండర్‌-19 టోర్నమెంటులో ఆడిన అర్జున్ టెండూల్కర్
  • టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్
  • న్యూజిలాండ్ తో ఎల్లుండి నుంచి వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ 

టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అర్జున్ తీవ్రంగా చమటోడ్చుతున్నాడు. ఇటీవల జేవై లేలే ఆలిండియా అండర్‌-19 టోర్నమెంటులో ముంబయికి ప్రాతినిధ్యం వహిచాడు.

తాజాగా బీసీసీఐ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో స‌చిన్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. అందులో అర్జున్ టెండూల్క‌ర్.. టీమిండియా ఆటగాళ్లకు బౌలింగ్ చేస్తున్నాడు. టీమిండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఎల్లుండి నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌కు అర్జున్ టెండూల్క‌ర్ వ‌చ్చి ఇలా బౌలింగ్ చేశాడు. 
  

  • Loading...

More Telugu News