జూపల్లి: టీఆర్ఎస్ లో చేరిన రేవంత్ రెడ్డి నియోజక వర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు!
- రేవంత్ రెడ్డి తీరుపై కొడంగల్ టీడీపీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి
- కొడంగల్ నాయకత్వం అంతా మా పార్టీలో చేరింది: జూపల్లి
- తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా మారింది: ఈటల రాజేందర్
తన సొంత నియోజక వర్గంలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో కొడంగల్ నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు.. తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... కొడంగల్ నాయకత్వం అంతా తమ పార్టీలో చేరిందని అన్నారు. అందుకు సీఎం కేసీఆర్ చేస్తోన్న అభివృద్ధి పనులే కారణమని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ప్రజలు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయని అన్నారు. పనిచేసే సర్కారు అనడానికి పాలమూరులో జరిగిన అభివృద్ధే నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా మారిందని అన్నారు.