నరసింహన్ : గవర్నర్ నరసింహన్ తల్లి మృతి!
- గవర్నర్ ఇంట విషాదం
- గవర్నర్ తల్లి అనారోగ్య కారణంగా కన్ను మూసినట్లు సమాచారం
- సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి కన్ను మూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. అనారోగ్యకారణంగా ఆమె తుది శ్వాస విడిచినట్టు సమాచారం. ఆమె మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. కొద్ది సేపటి క్రితం రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్.. విజయలక్ష్మి పార్థివదేహం మీద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. గవర్నర్ నరసింహన్ తల్లి మృతి పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా సంతాపం తెలియజేశారు.