dk aruna: రేవంత్ రెడ్డితో నాకు విభేదాలు లేవు: డీకే అరుణ

  • రేవంత్ రాక వల్ల నాకు ఇబ్బంది లేదు
  • అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తా
  • స్పష్టం చేసిన డీకే అరుణ
కాంగ్రెస్ పార్టీలోకి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేరుతున్నారనే వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు, రేవంత్ రెడ్డి రాకపై పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ కు పార్టీలో ఎలాంటి బాధ్యతలను అప్పగించరాదంటూ మరికొందరు నేతలు పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీలోని కొందరు కీలక నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. మాజీ మంత్రి డీకే అరుణను కూడా ఆయన కలిశారు. ఈ విషయమై అరుణను ఓ వార్తా ఛానల్ ప్రశ్నించగా... కాంగ్రెస్ లోకి రేవంత్ రావడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడే ఉంటానని స్పష్టం చేశారు. 
dk aruna
revanth reddy
tTelugudesam
congress
telangana congress

More Telugu News