revanth reddy: టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో రేవంత్... మరోపక్క డీకే అరుణ, కోమటిరెడ్డితో భేటీ వార్తలు!

  • డీకే అరుణ, కోమటిరెడ్డి సోదరులతో రేవంత్ భేటీ అంటూ ప్రచారం 
  • కుంతియాకు రేవంత్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారంటూ వార్తలు
  • టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారని గత రెండు రోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి సోదరులు, డీకే అరుణ తదితరులతో రేవంత్ సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రవేశాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ పై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ కుంతియాకు ఫిర్యాదులు వస్తున్నాయని కూడా వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, మరోపక్క ఆయన టీడీపీ భవన్ లో జరుగుతున్న పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. దీంతో రేవంత్ పార్టీ మార్పుపై ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు.
revanth reddy
Telugudesam
hydarabad
Telugudesam bhavan

More Telugu News