revanth reddy: రేవంత్ రెడ్డితో గంటసేపు చర్చించాను: బీజేపీ నేత

  • రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్
  • బీజేపీలో చేరమని కోరారా? అన్న ప్రశ్నను దాటవేసిన ప్రభాకర్
  • సమావేశానికి బయల్దేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిశానని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో హైదరాబాదులోని రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసినట్టు ప్రభాకర్ తెలిపారు. తమ భేటీ సుమారు గంట సేపు సాగిందని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే రేవంత్ రెడ్డిని ఆయన బీజేపీలోకి ఆహ్వానించారా? అన్నదానిపై స్పష్టతనివ్వకపోవడం విశేషం. అలాగే రేవంత్ పార్టీ మార్పుపై కూడా ఆయన స్పందించలేదు. 
revanth reddy
Telugudesam
hydarabad
bjp
prabhakar
meeting

More Telugu News