Telugudesam: చంద్రబాబే మా నేత.. పార్టీ మారడం లేదు: గ్రేటర్ అధ్యక్షుడు శ్రీనివాస్

  • హైదరాబాదులో టీడీపీ బలంగా ఉంది
  • మరింత బలోపేతం చేస్తాం
  • కార్యకర్తలు నిరుత్సాహానికి గురి కావద్దు
తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ అన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, టీడీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడే తమ నాయకుడని... ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెలిపారు.

హైదరాబాదులో టీడీపీ బలంగా ఉందని... పార్టీ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహ పడవద్దని అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా గ్రేటర్ నాయకులు పని చేయాలని చెప్పారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో... ఆయనతో పాటే పలువురు టీడీపీ నేతలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.
Telugudesam
greater hyderabad Telugudesam
chandrababu
greater hyderabad Telugudesam president

More Telugu News