chiranjeevi: 'సైరా'లో చిరూ లుక్ .. గెటప్ లలో మార్పులు?

  • చిరూ తాజా చిత్రంగా 'సైరా నరసింహా రెడ్డి'
  • దర్శకుడిగా సురేందర్ రెడ్డి .. నిర్మాతగా చరణ్  
  • ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లవలసి వుంది
చిరంజీవి 151వ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో మొదలవుతుందని గతంలో చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం పట్టొచ్చుననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. చిరంజీవి లుక్ .. గెటప్ విషయంలో కొన్ని మార్పులు చేయాలనుకోవడమే అందుకు కారణమనే వార్త షికారు చేస్తోంది.

ఎన్నో ఫోటో షూట్స్ చేసిన తరువాత చిరూ లుక్ ను .. గెటప్ ను ఖరారు చేసుకున్నారు. వాటిపైనే చిరంజీవి పూర్తి దృష్టి పెట్టారు. తీరా ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అనుకుంటూ ఉండగా, లుక్ లోను .. గెటప్ లోను మార్పులు వున్నాయంటూ చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమవుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనేలేదు.    
chiranjeevi
nayanatara

More Telugu News