yuvaraj singh: యువీపై మరదలు కేసు పెట్టలేదు...కేవలం భర్త, అత్తలపైనే కేసు పెట్టింది: న్యాయవాది వివరణ

  • యువరాజ్ సింగ్, అతని తల్లి, తమ్ముడిపై కేసు పెట్టిందంటూ మీడియాలో వార్తలు 
  • యువరాజ్ పై ఎలాంటి కేసు లేదన్న న్యాయవాది 
  • గురుగ్రామ్ పోలీసులను అడిగి తెలుసుకోవచ్చన్న లాయర్ 
టీమిండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌, అతడి కుటుంబ సభ్యులపై యువీ తమ్ముడు జొరావర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ కేసుపెట్టిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యువీపై కేసు విషయం వైరల్ కావడంతో యువీ లాయర్ దమన్ బీర్ సింగ్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.

యువరాజ్ సింగ్ మరదలు ఆకాంక్ష శర్మ తన భర్త, అత్తలపై మాత్రమే గృహహింస కేసు పెట్టిందని అన్నారు. యువీపై ఆకాంక్ష ఎలాంటి కేసు పెట్టలేదని ఆయన చెప్పారు. ఈ విషయం గురుగ్రామ్ పోలీసులను అడిగి తెలుసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. యువీపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఆయన చెప్పారు. కాగా, వేధింపులకు గురి చేస్తున్నారంటూ జొరావర్ సింగ్ భార్య ఆకాంక్ష పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలి విచారణ ఈ నెల 21న జరగనుంది. 
yuvaraj singh
shabnam singh
joraver singh
akanksh sharma

More Telugu News