venkatesh: వెంకటేశ్ సరసన మెహ్రీన్ కి దక్కనున్న ఛాన్స్!

షార్ట్స్‌లో చూడండి
'గురు' సినిమా తరువాత కథల ఎంపిక కోసం కొంత గ్యాప్ తీసుకున్న వెంకటేశ్ మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాటిలో తేజ దర్శకత్వంలో చేయనున్న సినిమా ఒకటి. ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలోనే తేజ వున్నాడని అంటున్నారు. మరో వైపున ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియపై కూడా ఆయన దృష్టి పెట్టాడని చెబుతున్నారు.

'నేనే రాజు నేనే మంత్రి' తో సక్సెస్ ను అందుకున్న కాజల్ ను, ఇందులో కథానాయికగా చేయమని తేజ అడిగాడట. అయితే వేరే కమిట్మెంట్స్ వున్న కారణంగా కుదరదని కాజల్ చెప్పేసిందట. దాంతో ఆయన మెహ్రీన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. బొద్దుగా వుండే ఈ అమ్మాయి అయితే వెంకటేశ్ సరసన నప్పుతుందనే ఉద్దేశంతో తేజ వున్నాడట. వెంకటేశ్ కి గల క్రేజ్ కారణంగా మెహ్రీన్ ఓకే చెప్పేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. నవంబర్ 2వ వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  
Go Back to Shorts
venkatesh
mehreen

More Telugu News