gopichand: కృష్ణవంశీ దర్శకత్వంలో మరోసారి గోపీచంద్?

షార్ట్స్‌లో చూడండి
యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా చేరువయ్యాడు. అయితే కొంతకాలంగా ఆయనతో సక్సెస్ దోబూచులాడుతోంది. ఈ మధ్య వచ్చిన 'గౌతమ్ నంద' కూడా ఆయనకి నిరాశనే మిగిల్చింది. దాంతో ఆయన నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో వుండనుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 కృష్ణవంశీని కూడా వరుసగా పరాజయాలే పలకరిస్తూ వస్తున్నాయి. దాంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడట. ప్రస్తుతం కృష్ణవంశీ .. గోపీచంద్ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయనీ, త్వరలోనే కథను లాక్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మొగుడు' పరాజయం పాలైంది. తాజా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.      
Go Back to Shorts
gopichand

More Telugu News