పాకిస్థానీల‌కు విదేశాంగ మంత్రి దీపావ‌ళి గిఫ్ట్‌

షార్ట్స్‌లో చూడండి
దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా పాకిస్థానీయుల‌కు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ మంచి బ‌హుమ‌తిని ఇచ్చారు. భార‌త దేశంలో ఆరోగ్య చికిత్స‌ల కోసం అర్జీ పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న అర్హులైన వారంద‌రికీ మెడిక‌ల్ వీసాలు జారీ చేస్తున్నట్లు ఆమె వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఇటీవ‌ల కంటి కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారికి, ఎముక మూలుగు (బోన్ మారో) మార్పిడి చికిత్స అవ‌స‌ర‌మైన ఓ వ్య‌క్తికి, కాలేయ చికిత్స అవ‌స‌ర‌మైన మ‌రో ఇద్ద‌రికి మెడిక‌ల్ వీసాలు జారీ చేయాల‌ని పాకిస్థాన్‌లోని భార‌త హై క‌మిష‌న్‌ను ఆమె ఆదేశించారు. అంతేకాకుండా ట్విట్ట‌ర్ ద్వారా ఆమె దృష్టికి వ‌చ్చిన అన్ని ర‌కాల మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీలకు ఆమె వీసా జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
deepavali
diwali
external ministry
sushma swaraj
pakistan
medical visa

More Telugu News