nani: ఇంట్రెస్టింగ్ గా నాని నెక్స్ట్ మూవీ టైటిల్!

  • నాని తాజా చిత్రంగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
  • కిషోర్ తిరుమలతో నెక్స్ట్ మూవీ 
  • జనవరిలోగానీ ఫిబ్రవరిలో గాని సెట్స్ పైకి 
  • వేసవి సెలవుల్లో విడుదల చేసే ఆలోచన        
నాని ఎంత మాత్రం సమయాన్ని వృథా చేయడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మూడు నెలలకో సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆయన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుండటంతో .. ఆయన నెక్స్ట్ మూవీని లైన్లో పెట్టేస్తున్నాడు.

 ఈ క్రమంలో నాని తన తదుపరి సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి 'చిత్రలహరి' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. టైటిల్ చాలా క్యాచీగా ఉండటం వలన దాదాపు ఇదే ఫిక్స్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. జనవరిలో గానీ .. ఫిబ్రవరిలో గాని ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నట్టు సమాచారం. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక కిషోర్ తిరుమల తాజా చిత్రంగా 'ఉన్నది ఒకటే జిందగీ' త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.      
nani

More Telugu News