‘రాజు గారి గది 2’: సమంత పాత్ర చిన్నదైనా మార్కులన్నీ పట్టుకుపోయింది: అక్కినేని నాగార్జున

  • ఈ చిత్రంలో ప్రతిఒక్కరి పాత్ర బాగుంటుంది
  • కేవలం హారర్ ఫిల్మ్ అయితే నేనే నటించే వాడిని కాదు
  • ఓ ఇంటర్వ్యూలో నాగార్జున

‘రాజు గారి గది 2’ సినిమాలో సమంత పాత్ర చిన్నదైనా మార్కులన్నీ పట్టుకుపోయిందని నటుడు నాగార్జున ప్రశంసించారు. ‘ఐడిల్ బ్రెయిన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ, ‘ఈ సినిమా సెకండ్ హాఫ్ లో సమంత వచ్చింది.. రెండు మూడు అరుపులు అరిచింది.. గాల్లోకి ఎగిరింది.. తర్వాత వచ్చి కూర్చుంది..అయిపోయింది. ఎవరి చెప్పినా సమంత పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని అంటున్నారు.

ఈ చిత్రంలో ప్రతిఒక్కరి పాత్ర బాగుంటుంది. ఈ చిత్రంలో రావు రమేష్ గారిది చిన్నపాత్ర అయినప్పటికీ, చాలా బాగా చేశారు. ప్రేక్షకులు ఆదరించారు కనుక, ఇటువంటి చిత్రాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తారు. ఈ చిత్రం కేవలం హారర్ ఫిల్మ్ అయితే నేను చేసే వాడిని కాదు. ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ కాబట్టే ఈ సినిమాలో నటించా’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News